నస్పూర్: సింగరేణిలో నిర్వహించే అధికారిక కార్యక్రమాల్లో అన్ని సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యా ల రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శులు కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి, కాపు కృష్ణ డిమాండ్ చేశారు. మంగళవారం వారు పలు డిమాండ్లతో కూడి న వినతిపత్రాన్ని హైదరాబాద్‌లోని రీజనల్ లేబర్ కార్యాలయంలో కమిషనర్ శర్వానన్‌కు అందజేశారు. అనంతరం వారు మాట్లాడు తూ సింగరేణిలో 2023 డిసెంబర్ 27న ఎ న్నికలు నిర్వహించారని, నిబంధనల ప్రకా రం 2025 డిసెంబర్ 26తో రెండేళ్ల కాల పరి మితి ముగిసిందని తెలిపారు. ట్రేడ్ యూని యన్ ఎన్నికలు నిర్వహించే వరకు అన్ని రిజి స్టర్డ్ యూనియన్లకు సమాన హోదా కల్పించా లని పేర్కొన్నారు. సమావేశాలు, సంక్షేమ కా ర్యాక్రమాలలో అన్ని సంఘాలకు ప్రాతి నిధ్యం లభించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


