ఇఫ్తార్‌ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే బొజ్జు పటేల్‌ | - | Sakshi
Sakshi News home page

ఇఫ్తార్‌ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే బొజ్జు పటేల్‌

Mar 15 2026 1:03 AM | Updated on Mar 15 2026 1:03 AM

జన్నారం: మండలంలోని పొనకల్‌ మేజర్‌ గ్రామ పంచాయతీ పరిధి మజీద్‌లో శనివారం నిర్వహించిన ఇఫ్తార్‌ విందులో ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌ పాల్గొన్నారు. పొనకల్‌ సర్పంచ్‌ జక్కు సుష్మభూమేశ్‌ ఆధ్వర్యంలో పండ్లు, స్వీట్లు అందజేసి విందు భోజనం చేశారు. పండుగలు మత సామరస్యానికి ప్రతీకగా నిలువాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ దుర్గం లక్ష్మీనారాయణ, వైస్‌ చైర్మన్‌ ఫసీఉల్లా, సర్పంచులు వెంకన్న, సురేశ్‌, కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు ముజాఫర్‌ అలీఖాన్‌, పార్టీ సీనియర్‌ నాయకులు గుర్రం మోహర్‌రెడ్డి, ఇందయ్య, రమేశ్‌, నందునాయక్‌, ఇసాక్‌, రియాజోద్దీన్‌, షాఖీర్‌ అలీ, ముజ్జు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement