మహిళల సంక్షేమానికి ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

మహిళల సంక్షేమానికి ప్రాధాన్యం

Mar 11 2026 7:24 AM | Updated on Mar 11 2026 7:24 AM

● జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ ● కలెక్టరేట్‌లో మహిళా దినోత్సవం

మంచిర్యాలఅగ్రికల్చర్‌: మహిళల సంక్షేమం, ఆర్థికా భివృద్ధికి మొదటి ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవా న్ని పురస్కరించుకుని మంగళవారం కలెక్టరేట్‌ స మావేశ మందిరంలో నిర్వహించిన వేడుకల్లో జిల్లా అదనపు కలెక్టర్‌ పి.చంద్రయ్య, వివిధ సంక్షేమ శాఖల అధికారులతో కలిసి పాల్గొన్నారు. కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ మాట్లాడుతూ ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా సౌర విద్యుత్‌ ప్లాంటు, పెట్రోల్‌ బంక్‌ల నిర్వహణతోపాటు ఇందిరా శక్తి క్యాంటీన్లు, పెరటికోళ్ల పెంపకం, ఇతర అనేక వ్యాపారాల్లో ప్రో త్సహిస్తూ మహిళలను ముందంజలో ఉంచే విధంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనుల్లో స్వయం సహాయక సంఘాల సభ్యులను భాగస్వాములను చేస్తూ చర్యలు తీసుకున్నామని, తద్వారా జిల్లాలో 3శాతం విద్యార్థుల సంఖ్య పెరిగిందని, రాష్ట్రంలో జిల్లా ముందంజలో ఉందని వివరించారు. పలువురు మహిళలను కలెక్టర్‌ సన్మానించి మెమొంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారులు రౌఫ్‌ ఖాన్‌, దుర్గాప్రసాద్‌, డీఆర్‌డీవో కిషన్‌, డీపీఆర్‌వో కృష్ణమూర్తి, మంచిర్యాల మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ దర్ని మధుకర్‌, లక్సెట్టిపేట ము న్సిపల్‌ చైర్‌పర్సన్‌ అంజలి, వైస్‌ చైర్‌పర్సన్‌ రాజేశ్వరి, అధికారులు, స్వయం సహాయక సంఘాల మహిళలు, వివిధ ప్రభుత్వ శాఖల మహిళా ఉద్యోగులు, అధికారులు పాల్గొన్నారు.

అక్కాచెల్లెళ్లకు సన్మానం

కలెక్టర్‌ చేతుల మీదుగా అక్కాచెల్లెళ్లు హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ సిరిపురం విజయలక్ష్మి, జూనియర్‌ లెక్చరర్‌ ఆడెవు గీతాంజలి ఉత్తమ ఉద్యోగులుగా సన్మానం, మెమొంటోలు అందుకున్నారు. నస్పూర్‌ పట్టణాని కి చెందిన వేముల మల్లేష్‌, సత్యవతి దంపతుల కూతుళ్లు విజయలక్ష్మి బెల్లంపల్లి కళాశాల వసతిగృహంలో హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌గా, గీతాంజలి సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌లో జూనియర్‌ లెక్చరర్‌గా పని చేస్తున్నారు.

కోలాటం వేస్తున్న మహిళలు

మహిళలను సన్మానిస్తున్న కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement