అదృశ్యమైన మహిళ మృతదేహం లభ్యం | - | Sakshi
Sakshi News home page

అదృశ్యమైన మహిళ మృతదేహం లభ్యం

Mar 15 2026 1:04 AM | Updated on Mar 15 2026 1:04 AM

బాసర: గత నెల 28న అదృశ్యమైన మహిళ మృతదేహం లభ్యమైంది. తానూరు మండలం బమ్మిని గ్రామానికి దుర్గావార్‌ నీలాబాయి (58) బాబు దంపతులు కొంతకాలంగా బాసరలోని గణేశ్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. బాబు ట్రిపుల్‌ఐటీలో సెక్యూరిటీగార్డుగా పనిచేస్తుండగా వారి కుమారుడు విష్ణుమూర్తి రైల్వేలో ఉద్యోగం చేస్తున్నాడు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నీలాబాయి ఫిబ్రవరి 28న ఇంటినుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మార్చి 1న బాసర పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. శనివారం గణేశ్‌నగర్‌ గుట్ట ప్రాంతంలో దుర్వాసన రావడంతో స్థానికులు అటుగా వెళ్లి చూడగా చెట్టుకు ఉరేసుకుని కనిపించింది. విష్ణుమూర్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ కిరణ్‌ తెలిపారు.

వివాహిత అదృశ్యం

ఆదిలాబాద్‌టౌన్‌: ఆదిలాబాద్‌ పట్టణంలోని విద్యానగర్‌ కాలనీకి చెందిన 25 ఏళ్ల వివాహిత అదృశ్యమైంది. శనివారం ఇంట్లో భర్తతో గొడవజరగడంతో సదరు మహిళ బయటకు వెళ్ళిపోయింది. రాత్రి వరకూ రాకపోవడంతో కుటుంబీకులు చుట్టుపక్కల గాలించినా ఆచూకీ లభించలేదు. మహిళ భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూ టౌన్‌ సీఐ నాగరాజు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement