సమష్టి కృషితో విద్యుత్‌ ఉత్పత్తి | - | Sakshi
Sakshi News home page

సమష్టి కృషితో విద్యుత్‌ ఉత్పత్తి

Mar 7 2026 7:31 AM | Updated on Mar 7 2026 7:31 AM

చెన్నూర్‌: సింగరేణి థర్మల్‌ పవర్‌ ప్లాంటు అధికారుల మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు, విభేదాలు లేవని, అందరి సమష్టి కృషితో నిరంతరం విద్యుత్‌ ఉత్పత్తి సాధిస్తున్నామని ఎస్టీపీపీ జీఎంలు నర్సింహారావు, మదన్‌మోహన్‌ అన్నారు. జైపూర్‌ మండల కేంద్రంలోని ప్రాణహిత అతిథి గృహంలో శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడారు. యాష్‌ డిస్పోజల్‌ ప్రక్రియ పూర్తిగా కార్పొరేట్‌ నిబంధనలు, కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్‌ ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ ఫారెస్ట్స్‌(ఎంవోఈఎఫ్‌), ఎంవోపీ మార్గదర్శకాల ప్రకారం జరుగుతుందని తెలిపారు. ముందు నుంచీ ఎస్టీపీపీలో వంద శాతం యాష్‌ వినియోగం జరుగుతోందని, పలు ఉత్తమ అవార్డులు సైతం అందుకుందని అన్నారు. ఎస్టీపీపీ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడంతోపాటు కొత్త ప్లాంటు పనులు కూడా ముమ్మరంగా సాగుతున్నాయని, కొందరు వ్యక్తులు వారి స్వార్థం కోసం ఎస్టీపీపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో డీజీఎం(పర్సనల్‌) కిరణ్‌బాబు, స్వామిరాజు, వాసుదేవమూర్తి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement