మాస్టర్‌ చెఫ్‌ పోటీల్లో రన్నరప్‌గా తల్లీకూతుళ్లు | - | Sakshi
Sakshi News home page

మాస్టర్‌ చెఫ్‌ పోటీల్లో రన్నరప్‌గా తల్లీకూతుళ్లు

Mar 7 2026 7:31 AM | Updated on Mar 7 2026 7:31 AM

● టాప్‌ 25 నుంచి ఫైనల్‌ వరకు ● తెలుగు రాష్ట్రాల్లో మొదటి జోడి

మంచిర్యాలటౌన్‌: మంచిర్యాలకు చెందిన తల్లీకూతుళ్లు రాచకొండ చందన, సాయిశ్రీ సోనీ టీవీలో ప్రసారం అవుతున్న మాస్టర్‌ చెఫ్‌ ఇండియా జోడి 10 సీజన్‌లో రన్నరప్‌గా నిలిచారు. శుక్రవారం జరిగిన ఫైనల్‌లో మహారాష్ట్రకు చెందిన జోడితో తలపడి అందరి ప్రశంసలు అందుకున్నారు. మంచిర్యాలలో నివాసం ఉంటున్న రాచకొండ రవిచందర్‌, చందన దంపతుల కూతురు సాయిశ్రీ బీటెక్‌ చదివినా వంటలపై ఉన్న ఆసక్తి, అభిరుచితో తెలుగు మాస్టర్‌ చెఫ్‌ సీజన్‌–1లో పాల్గొని టాప్‌ 6 సెమీఫైనల్‌ వరకు చేరింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఎల్లిపాయకారం రెస్టారెంట్‌కు కో ఫౌండర్‌గా ఉంటూనే కుటుంబ వ్యాపారం సిరి క్యాటరింగ్‌ బాధ్యతలు నిర్వహిస్తోంది. తల్లి చందన నస్పూరులో ప్రకృతి సేద్యంతో వ్యవసాయం చేస్తోంది.

తెలుగు రాష్ట్రాల నుంచి మొదటి జోడి

దేశవ్యాప్తంగా కొన్ని వందల మంది మాస్టర్‌ చెఫ్‌ కార్యక్రమానికి హాజరయ్యారు. టాప్‌ 25లో తల్లీకూతుళ్లు చందన, సాయిశ్రీ ఎంపికై టాప్‌ 12లో కొనసాగుతూ తెలుగు రాష్ట్రాల నుంచి మాస్టర్‌ చెఫ్‌ ఇండియాలో పాల్గొన్న మొదటి జోడిగా చరిత్ర సృష్టించారు. తెలంగాణ వంటకాల సంస్కృతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. టాప్‌ 12 జోడిల్లో ప్రతిభను కనబరిచి ఫైనల్‌కు చేరినా రన్నరప్‌గా నిలిచి రూ.5 లక్షల పారితోషికం అందుకున్నారు. ఫైనల్‌ శుక్రవారం రాత్రి సోనిలో ప్రసారం కావడంతో తల్లీకూతుళ్లు ప్రశంసలు అందుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement