బెల్లంపల్లి: రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు బెల్లంపల్లి ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ(సీఓఈ) పాఠశాల/కళాశాల, నంబర్ టు ఇంకై ్లన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మహబూబాబాద్ నీలికొండలోని సాక్రెడ్ హైస్కూల్లో ఈ నెల 7 నుంచి 9వరకు రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించనున్నారు. అండర్–14 పోటీలకు సీఓఈ గురుకుల విద్యార్థులు డి.విశ్వతేజ, పి.ఋశేంద్ర వర్మ, జి.సుశాంత్, ఏ.శ్రీహర్షవర్థన్, ఎస్.సంకీర్తసాయి, డి.చైతన్య, ఎస్.విజయచంద్ర ఎంపికయ్యారు. హైస్కూల్‌కు చెందిన బాలికలు విలాక్ష, సామ్రీన్, సన ఎంపికయ్యారు. విద్యార్థులను సీఓఈ గురుకుల ప్రిన్సిపాల్ ఆకిడి విజయ్‌సాగర్, హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు కే.విజయలక్ష్మి వేర్వేరుగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కొండలరావు, గోపి, దశరథం, ఫిజికల్ డైరెక్టర్ ఎండి.చాంద్‌పాషా, వ్యాయామ ఉపాధ్యాయులు అల్లూరి వామన్, ఎం.రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


