వైద్య విద్యార్థులకు అండగా నిలుస్తాం | - | Sakshi
Sakshi News home page

వైద్య విద్యార్థులకు అండగా నిలుస్తాం

Mar 7 2026 7:31 AM | Updated on Mar 7 2026 7:31 AM

● పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ● కళాశాలకు బస్సులు ప్రారంభం

మంచిర్యాలరూరల్‌(హాజీపూర్‌): ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థుల చదువుల కోసం ఎలాంటి అవసరాలు అవసరమైనా అండగా నిలుస్తామని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. శుక్రవారం గుడిపేటలోని ప్రభుత్వ వైద్య కళాశాలకు ఎంపీ ల్యాండ్స్‌, డీఎంఎఫ్‌టీ నిధుల నుంచి మంజూరైన మూడు బస్సులకు జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌తో కలిసి ఎంపీ వంశీకృష్ణ ప్రత్యేక పూజలు చేశారు. జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రూ.80 లక్షలతో బస్సులు ఏర్పాటు చేశామని తెలిపారు. వైద్య విద్యార్థులు జిల్లాను రాష్ట్ర, జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలపాలని, వైద్య విద్య పూర్తి చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలిపారు. త్వరలోనే విద్యార్థులకు స్పోర్ట్స్‌ కిట్లు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్‌ కుమార్‌దీపక్‌ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రిని త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్య కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌లు రేఖ, జగతి, హెచ్‌ఓడీ శ్రీకాంత్‌, ఏడీ తులసీదేవి, అధ్యాపక బృందం, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement