ఉట్నూర్‌రూరల్: ప్రజావాణి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో యువరాజ్ మర్మాట్ అన్నారు. సోమవారం ఉట్నూర్‌లోని ఐటీడీఏ కార్యాలయంలో గిరిజనుల నుంచి అర్జీలు స్వీకరించారు. సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. కడెంకు చెందిన జామ్లాబాయ్ తనకి వ్యవసాయ క్షేత్రానికి సాగునీరు అందించేందుకు పైపులు మంజూరు చేయాలని, సిర్పూర్ (యు)కు చెందిన గేడం గజానంద్ ఏకలవ్య పాఠశాలలో స్లీపర్ ఉద్యోగం ఇప్పించాలని, సిరికొండ మండలానికి చెందిన రామారావు సోలార్ పంపుసెట్ మంజూరు చేయించాలని కోరారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు పింఛన్, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, వ్యవసాయ, రెవెన్యూ శాఖలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని దరఖాస్తులు అందజేశారు.
ఉపాధికోసం తిరుగుతున్నా..
నేను దివ్యాంగురాలిని. కుటుంబ పోషణ భారంగా ఉంది. ఏదైనా ఉపాధి కల్పిస్తే కుటుంబాన్ని పోషించుకుంటా. పలుమార్లు ఐటీడీఏకు వచ్చినా సమస్య పరిష్కారం కాలేదు. ఇప్పటికై నా సమస్య పరిష్కరించాలి.– కొడప అంజన
బాయి, మాంజ్రీ గ్రామం, నార్నూర్


