తానూరు: తానూర్ తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహించే వీఆర్‌ఏలతో అధికారులు వ్యక్తిగత పనులు చేయించుకోవ డం చర్చనీయాంశమైంది. కార్యాలయంలో ప్రభుత్వ పనులు చేయించుకోవాల్సిన అధికా రులు తమ సొంత పనులు చేయాలని ఆదేశి స్తున్నారు. గురువారం ఓ అధికారి వీఆర్‌ఏతో కారు శుభ్రం చేయించుకున్నాడు. కార్యాలయానికి వచ్చిన మండల వాసులు ఈ దృశ్యాన్ని సెల్‌ఫోన్‌లో బంధించారు. అధికారుల తీ రుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయ మై ‘సాక్షి’ సదరు అధికారిని వివరణ కోరగా, కారుపై చెత్త పడడంతో తొలగించాడని తెలిపారు.


