క్రీడలతో మానసిక ఉల్లాసం | - | Sakshi
Sakshi News home page

క్రీడలతో మానసిక ఉల్లాసం

Mar 16 2026 7:25 AM | Updated on Mar 16 2026 7:25 AM

● కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

● కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

మంచిర్యాలటౌన్‌: క్రీడాపోటీలతో మానసిక ఉల్లా సం కలుగుతుందని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అ న్నారు. జిల్లా కేంద్రంలోని ఉషోదయ పాఠశాలలో రెవెన్యూ ఉద్యోగులకు ఆదిలాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడా పోటీలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రెవెన్యూ ఉద్యోగులకు పని ఒత్తిడి అధికంగా ఉంటుందని, ఒక్కోసారి నిర్ణీత పనివేళలను మించి పని చేయాల్సి ఉంటుందన్నారు. వ్యాయామం, యోగ, క్రీడలు, ప్ర తీఒక్కరి దైనందిన జీవితంలో భాగం కావాలన్నారు. అనంతరం పోటీల్లో విజేతలకు బ హుమతులు, మెమొంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ పి.చంద్రయ్య, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్‌ మ హమ్మద్‌ విలాయత్‌ అలీ, తదితరులు పాల్గొన్నారు.

నేడు తహసీల్‌ కార్యాలయాల ఎదుట ధర్నా

చెన్నూర్‌: రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సోమవారం జిల్లాలోని అన్ని మండల రెవెన్యూ కార్యాలయాల ఎదుట ఉదయం 11గంటలకు ధర్నా నిర్వహిస్తున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్‌ తెలిపా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుపేదలకు ఇళ్లు, వృద్ధులు, వితంతువులకు పెన్షన్లు అందక ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద్రరావు పిలుపు మేరకు ధర్నా చేస్తున్నట్లు తెలిపారు. పేదలు, రైతులు అష్టకష్టాలు పడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వ తీరును ఎండగడుతూ తహసీల్‌ కార్యాలయాల ఎదుట చేపట్టిన ధర్నాను విజయవంతం చేయాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement