ఒకరి మృతికి కారణమైన నిందితుడి రిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

ఒకరి మృతికి కారణమైన నిందితుడి రిమాండ్‌

Mar 12 2026 7:18 AM | Updated on Mar 12 2026 7:18 AM

కై లాస్‌నగర్‌(బేల): మద్యం సేవించి నిర్లక్ష్యంగా వాహనం నడిపి ఒకరి మరణానికి కారణమైన నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు జైనథ్‌ సీఐ జి. శ్రావణ్‌ తెలిపారు. గతేడాది నవంబర్‌ 5న రాత్రి ఆదిలాబాద్‌ రూరల్‌ మండలం లాండసాంగ్వీ గ్రామానికి చెందిన అంకత్‌ గణేశ్‌ మద్యం సేవించి వాహనం నడుపుతూ బేలకు చెందిన బావని శ్రీకాంత్‌ (25)ను మండల కేంద్రంలోని గణేశ్‌ గార్డెన్‌ వద్ద ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని తండ్రి వాగు ఫిర్యాదు మేరకు బేల పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. నిందితుడిని బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement