మందమర్రిరూరల్: మందమర్రి ఏరియాలోని జీఎం కార్యాలయ ఆవరణలోగల కాన్ఫరెన్స్ హాల్‌లో కొత్తగా కేంద్ర ప్రభుత్వ అమలు చేస్తు న్న నాలుగు లేబర్ కోడ్స్‌పై బుధవారం డిప్యూ టీ చీఫ్ లేబర్ కమిషనర్ (సెంట్రల్) బిశ్వ భూ షణ్ ప్రుస్టి అధికారులకు అవగాహన కల్పించా రు. కేంద్ర ప్రభుత్వం నవంబర్ 21నుంచి 29చట్టాలను కొత్తగా నాలుగు లేబర్ కోడ్స్‌గా మా ర్చినట్లు తెలిపారు. కార్మికుల సంక్షేమం, హ క్కుల భద్రత, వేతన నిర్మాణం, పారదర్శక ఉ ద్యోగ వ్యవస్థ కోసం రూపొందించిన కోడ్స్‌ను సరిగా అర్థం చేసుకుని అమలు చేయడం అ త్యంత అవసరమని సూచించారు. అనంతరం ఏరియా ఇన్‌చార్జి జీఎం మల్లయ్య ఆధ్వర్యంలో అధికారులు కమిషనర్‌ను సన్మానించారు. అసిస్టెంట్ లేబర్ కమిషనర్ (రామగుండం) యూ సఫ్, ఎస్వోటూ జీఎం లలితేంద్రప్రసాద్, డీజీ ఎం (పర్సనల్) అశోక్‌కుమార్, కేకే గ్రూపు ఏ జెంట్ రాంబాబు, ఏరియా ఇంజినీర్ బాలాజీ భగవతీఝా, ఏరియా అధికారులు, గనులు, డిపార్ట్‌మెంట్ల సంక్షేమాధికారులున్నారు.
7వ తేదీకల్లా వేతనాలు చెల్లించాలి
చెన్నూర్: ఎస్టీపీపీలో ఆయా కంట్రాక్ట్ ఏజెన్సీ లు ప్రతీనెల 7వ తేదీకల్లా కార్మికులకు వేతనా లు చెల్లించాలని డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ బిశ్వ భూషణ్ ఆదేశించారు. జైపూర్ మండల కేంద్రంలోని ఎస్టీపీపీని సందర్శించగా జీఎంలు నర్సింహారావు, మదన్‌మోహన్ స్వాగతం పలి కారు. అనంతరం ఆయన స్థానిక ప్రాణహిత అ తిథి గృహంలో పలు ఏజెన్సీలతో సమావేశమై రికార్డులు తనిఖీ చేశారు. పీఎఫ్, ఈఎస్‌ఐ కూ డా అందించాలని సూచించారు. అనంతరం నూతన కార్మిక చట్టాలపై అవగాహన కల్పించా రు. అసిస్టెంట్ లేబర్ కమిషనర్ ఎండీ యూసఫ్, డీజీఎం శివప్రసాద్, కిరణ్‌బాబు, ఇతర అధికారులు, ఏజెన్సీల కాంట్రాక్టర్లున్నారు.


