మందమర్రిరూరల్(రామకృష్ణాపూర్): కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్‌ఎస్ నాయకులపై కేసులు పెట్టించి రాక్షస ఆనందం పొందుతోందని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ అన్నారు. ఇటీవల ఆదిలాబాద్ జిల్లా జైలు నుంచి బయటకు వచ్చిన ఆయన ఆదివారం రామకృష్ణాపూర్ పోలీస్‌స్టేషన్‌లో సంతకం చేసేందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యాతనపల్లి మున్సిపాలిటీలో చైర్మన్ ప్రమాణ స్వీకారం రోజున కాంగ్రెస్ నాయకులు ప్రవర్తించిన తీరు ప్రజాస్వామ్యానికి మాయని మచ్చగా నిలుస్తోందన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలపై దృష్టి సారించాలన్నారు. ఆయన వెంట బీఆర్‌ఎస్ నాయకులు మూల రాజిరెడ్డి, తదితరులు ఉన్నారు.


