ఇఫ్తార్‌ విందుకు హాజరైన మంత్రి | - | Sakshi
Sakshi News home page

ఇఫ్తార్‌ విందుకు హాజరైన మంత్రి

Mar 11 2026 7:24 AM | Updated on Mar 11 2026 7:24 AM

మందమర్రిరూరల్‌: పట్టణంలోని సెకండ్‌ జోన్‌ రైల్వేస్టేషన్‌ రోడ్డు పక్కనున్న ఆస్రా మజీద్‌లో మంగళవారం నిర్వహించిన ఇఫ్తార్‌ విందుకు రాష్ట్ర గనులు, కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి డాక్టర్‌ వివేక్‌వెంకటస్వామి జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌తో కలిసి హాజరయ్యారు. మత పెద్దలతో కలసి ఇఫ్తార్‌ విందు ఆరగించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున ముస్లింలకు తోఫా కిట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీశాఖ అధికారి శివ్‌ ఆశిష్‌సింగ్‌, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి రాజేశ్వరి, తహసీల్దార్‌ సతీష్‌కుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ రాజలింగు, మజీద్‌ కమిటీ పెద్దలు, ముస్లింలు, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement