ప్రతిఒక్కరూ తమ ఆరోగ్యంపై శ్రద్ధ చూ పాలి. ప్రతీరోజు వ్యా యామం చేయడం అలవాటు చేసుకోవాలి. బీపీ, షుగర్ అదుపులో ఉంచుకోవాలి. పాయిజన్ తీసుకున్న వారిలో కిడ్నీ సమస్యలు ఎక్కువగా ఎదురవుతున్నాయి. నిర్మల్ జనరల్ ఆస్పత్రిలో ప్రస్తుతం 78 మంది డయాలసిస్ సేవలు పొందుతున్నారు.
– డాక్టర్ గోపాల్ సింగ్,
నిర్మల్ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్
జీవన శైలితోనే నియంత్రణ
కిడ్నీ వ్యాధిని ప్రారంభ దశలో గుర్తిస్తే మందులతోనే నియంత్రించవచ్చు. ఎక్కువ ప్రభావితమైన తర్వాత డయాలసిస్ లేదా కిడ్నీ మార్పిడి తప్పదు. అందుకే ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తూ క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలి. లక్షణాలు కనిపిస్తే డాక్టర్‌ను సంప్రదించాలి. డాక్టర్లను సంప్రదించకుండా మితిమీరిన పెయిన్‌కిల్లర్స్ వాడకూడదు. ఆరోగ్య అవగాహనే కిడ్నీలకు ఉత్తమ రక్షణ.
– డాక్టర్ అశోక్, యూరాలజిస్టు, నిర్మల్


