సిరికొండ: బొలెరో వాహనంలో పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తున్న ఇద్దరు డ్రైవర్లపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై విక్రమ్ తెలిపారు. సోమవారం సాయంత్రం మండల కేంద్రంలో వాహనాలు తనిఖీ నిర్వహిస్తుండగా కుంటగూడ, చింతగూడ గ్రామాలకు చెందిన ఒక్కో వాహనంలో సుమారు 50 మందికి పైగా ప్రయాణికులను తరలిస్తూ పట్టుబడ్డారు. డ్రైవర్లు పెందూర్ ఇంద్రు, కినక నాగోరావుపై మంగళవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. గూడ్స్ వాహనంలో ప్రయాణికులను తరలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


