మంచిర్యాలటౌన్: మంచిర్యాల నగరంలోని రాజీవ్‌నగర్‌లో నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇళ్లను అర్హులకు మాత్రమే పంపిణీ చేస్తామని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు అన్నారు. ఆదివారం అధికారులతో కలిసి ఇళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇటీవల రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో మాట్లాడామన్నారు. ఇందిరమ్మ, డబుల్ బెడ్‌రూం ఇళ్లపై ఉమ్మడి జిల్లా సమావేశంలో మంచిర్యాల నియోజకవర్గంలో గత ప్రభుత్వం నిర్మించిన ఇళ్ల పరిస్థితిపై వివరించామన్నారు. మంత్రి స్పందించి మౌలిక వసతుల కల్పనకు హామీ ఇచ్చినట్లు తెలిపారు. మూడు నెలల తరువాత లక్కీ డ్రా పద్ధతిలో అర్హులకు డబుల్ బెడ్‌రూంలు ఇస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అర్హుల నుంచి ఎవరైనా డబ్బులు తీసుకుంటే సహించేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ అన్వేష్, మేయర్ దర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య, తదితరులు పాల్గొన్నారు.


