టామ్‌కామ్‌ ద్వారా యువతకు ఉపాధి | - | Sakshi
Sakshi News home page

టామ్‌కామ్‌ ద్వారా యువతకు ఉపాధి

May 14 2026 6:27 AM | Updated on May 14 2026 6:27 AM

● మంత్రి వివేక్‌ వెంకటస్వామి

మందమర్రిరూరల్‌: తెలంగాణ ప్రభుత్వ ప్రోత్సాహంతో టామ్‌కామ్‌ ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని రాష్ట్ర మంత్రి వివేక్‌ వెంకటస్వామి అన్నారు. బుధవారం పట్టణంలోని సింగరేణి హైస్కూల్‌ పక్కన గల స్కిల్‌ డెవలప్మెంట్‌ సెంటర్లో టామ్‌కామ్‌ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువతకు టామ్‌ కామ్‌ సంస్థ ఆయా దేశాల భాషలు నేర్పించి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. జర్మనీ, జపాన్‌, ఇజ్రాయిల్‌ దేశాలతో పాటు గ్రీస్‌, యూరప్‌ దేశాలలో అనేక ఉద్యోగావకాశాలు ఉన్నాయన్నారు. వారానికి 35 గంటల పనివిధానం, సుమారు రూ.2 లక్షల వరకు వేతనం పొందే అవకాశం ఉందన్నారు. నర్సింగ్‌, ప్లంబర్‌, ఎలక్ట్రీషియన్‌, వంటి కోర్సులు చదివిన వారు దరఖాస్తు చేసుకుంటే జూన్‌ 10న శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌, ఏరియా జీఎం రాధాకృష్ణ, జిల్లా ఉపాధి కల్పన అధికారి రవికృష్ణ, టామ్‌కామ్‌ సంస్థ మేనేజర్‌ అనీల్‌కుమార్‌, తహసీల్దార్‌ సతీష్‌కుమార్‌, సింగరేణి అధికారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement