● అవుట్‌టర్న్‌ రాకపోతే అదనం ● ధాన్యం కొనుగోళ్లలో కిలోల కొద్దీ కోత ● తేమ, తాలు పేరుతో రైతుల కష్టం దోపిడీ | - | Sakshi
Sakshi News home page

● అవుట్‌టర్న్‌ రాకపోతే అదనం ● ధాన్యం కొనుగోళ్లలో కిలోల కొద్దీ కోత ● తేమ, తాలు పేరుతో రైతుల కష్టం దోపిడీ

May 16 2026 1:27 AM | Updated on May 16 2026 1:27 AM

● అవుట్‌టర్న్‌ రాకపోతే అదనం ● ధాన్యం కొనుగోళ్లలో కిలోల కొద్దీ కోత ● తేమ, తాలు పేరుతో రైతుల కష్టం దోపిడీ

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ధాన్యం కొనుగోళ్లలో బస్తాకు రెండు కిలోలపైనే తరుగు పేరుతో కోత విధిస్తున్నారు. ఒక్కో క్వింటాల్‌కు నిబంధనల మేరకు 17శాతం తేమతో బస్తాకు 40కిలోల చొప్పున తూకం వేయాలి. వీటిని అదనంగా గన్నీ సంచికి బదులు సంచీ లేదా మరో 600 గ్రాములు అదనంగా వేయాలి. కానీ అంతకుమించి ఒక్కో బస్తాకు 42కిలోలకు రైతులను ఒప్పించి తూకం వేస్తూ ధాన్యం తరలిస్తున్నారు. మిల్లర్లు తేమ, తరుగు పేరుతో బస్తాకు మరో కిలో చొప్పున 43కిలోల వరకు తీసుకుంటున్నారు. అలా అయితేనే ఒప్పుకుని మిల్లుల్లో ధాన్యం దించుకుంటున్నారు. ఇక వడ్లలో మిల్లింగ్‌ చేస్తే బియ్యం తక్కువగా వస్తుందని మరోసారి కోత పెడుతున్నారని కొన్ని చోట్ల రైతులు వాపోతున్నారు. దీంతో చాలాచోట్ల లారీల్లో ధాన్యం దించకుండా మిగిలిపోతోంది. ఇప్పటికీ జిల్లాలో 43కిలోల చొప్పున తూకం వేస్తున్నారు. రైతులకు చెల్లించే ధా న్యం విలువ, కేంద్రానికి త రలించిన వాస్తవ ధాన్యానికి వ్యత్యాసం వస్తోంది. ఒక్కో క్వింటాల్‌కు ఆ మేరకు చెల్లిస్తున్నారు. దీనిపై ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులు తీవ్రంగా ఆరోపణలు చేస్తున్నారు.

పోటెత్తుతున్న ధాన్యం

జిల్లాలో ఈ సీజన్‌లో రెండు లక్షలకు పైగా మెట్రిక్‌టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం ఉండగా.. 334 కేంద్రాల నుంచి ఇప్పటివరకు 47వేల మెట్రిక్‌ టన్నులకు పైగా సేకరణ పూర్తయింది. ఇంకా కేంద్రాలకు ధాన్యం పోటెత్తుతోంది. మొత్తం ఈ సీజన్‌లో 11మిల్లులకు ట్యాగింగ్‌ చేశారు. ఇవి కాక తొ మ్మిది రాష్ట్ర గిడ్డంగుల సంస్థ పరిధిలోని గో దాములు, ఎనిమిది ప్రైవేటు గోదాముల్లో నిల్వ చేస్తున్నా రు. అలాగే కరీంనగర్‌, పెద్దపల్లి జిల్లాలకు ధాన్యం తరలింపునకు అనుమతి ఉంది. మొదట సరిపడా మిల్లులు లేక తరలింపులో జా ప్యం జరిగింది. ప్రత్యామ్నాయంగా గోదాంలు, బ్లాక్‌ లిస్టుల మిల్లుల్లోనే నిల్వ చేయడంతో కొంత ఉపశమనం కలుగుతోంది. లేకపోతే మరింత ఇబ్బంది కలిగేది.

అవుట్‌టర్న్‌ రావడం లేదని..

జైపూర్‌ మండలం కిష్టాపూర్‌కు చెందిన రైతుల ధాన్యంలో మిల్లింగ్‌(అవుట్‌టర్న్‌ రేషియో) ప్రతీ వంద గ్రాముల వడ్లకు 61గ్రాముల లోపే బియ్యం వస్తున్నాయని మందమర్రి మండలం అందుగులపేట వెంకటేశ్వర అగ్రో రైస్‌ మిల్లులో దించుకునేందుకు అభ్యంతరం చెప్పారు. దీంతో లారీలు ధాన్యంతో రెండు రోజులుగా అక్కడే నిలిచిపోయాయి. అదనంగా మరో కిలో తరుగుకు ఒప్పుకుంటే దించుకుంటామని చెప్పారు. దీంతో కిష్టాపూర్‌కు చెందిన రైతులు నేరుగా కలెక్టరేట్‌కు వచ్చి అదనపు కలెక్టర్‌ రాములుకు ఫిర్యాదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement