తాగునీటి సమస్యపై ఆందోళన | - | Sakshi
Sakshi News home page

తాగునీటి సమస్యపై ఆందోళన

May 13 2026 2:14 AM | Updated on May 13 2026 2:14 AM

తాండూర్‌: మండల కేంద్రమైన తాండూర్‌ మేజర్‌ గ్రామ పంచాయతీ మేదరివాడ, అశోక్‌నగర్‌ కాలనీ వాసులు తాగునీటి సమస్యపై ఆందోళన చేపట్టారు. మంగళవారం ఆర్‌అండ్‌బీ రహదారిపై ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ ఎన్నోసార్లు మంచినీటి సమస్యపై విన్నవించినా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. మూడు నెలల క్రితం బోరు వేసినా మోటారు బిగించలేదని వాపోయారు. పంచాయతీ రాజ్‌ ఈఓ దివాకర్‌ ఆందోళనకారులతో మాట్లాడారు. రెండ్రోజుల్లో సమస్య పరిష్కారానికి హామీనివ్వడంతో ఆందోళన విరమించారు. పంచాయతీ అధికారులు, సర్పంచ్‌ ముడిమడుగుల సురేష్‌ ట్యాంకర్ల ద్వారా కాలనీలో నీరు సరఫరా చేశారు. బోరుకు మోటారు బిగించి పైపులైన్‌కు అనుసంధానించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ మనోహర్‌, యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు పెట్టెం విష్ణుకల్యాణ్‌, నాయకుడు పురంశెట్టి అరుణ్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement