‘మున్నూరు కాపుల సంఖ్య తక్కువ చూపడం సరికాదు’ | - | Sakshi
Sakshi News home page

‘మున్నూరు కాపుల సంఖ్య తక్కువ చూపడం సరికాదు’

May 12 2026 12:08 AM | Updated on May 12 2026 12:08 AM

మంచిర్యాలరూరల్‌(హాజీపూర్‌): ప్రభుత్వం చేపట్టిన కులగణనలో మున్నూరు కాపుల సంఖ్య తక్కువ చూపడం సరికాదని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర కార్యదర్శి, జిల్లా ఇంచార్జీ ఇందూరి తిరుపతి అన్నారు. సోమవారం మంచిర్యాలలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు చిట్ల సత్యనారాయణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 40 లక్షలకు పైగా ఉన్న మున్నూరు కాపులను ఇటీవల కాంగ్రెస్‌ ప్రభుత్వం కులగణన ప్రకారం 13.80లక్షల వరకు ఉన్నట్లు చెబుతూ 3.9శాతంగా చూపించడం అన్యాయమని అన్నారు. జిల్లా ఇంచార్జీల పర్యవేక్షణలో తమ జనాభాను తామే లెక్కించుకుని సంఖ్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. సంఘం జిల్లా కార్యదర్శులు చిట్ల సత్యనారాయణ, మిట్ట లక్ష్మణ్‌, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు బోరిగం రాజారాం, నియోజకవర్గ అధ్యక్షుడు పల్లె భూమేశ్‌, మున్నూరు కాపు ట్రస్ట్‌ చైర్మన్‌ నల్ల శంకర్‌, గౌరవ అధ్యక్షుడు బొలిశెట్టి రాజలింగు, గొంగళ్ల శంకర్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement