ఘటనకు బాధ్యులపై చర్య తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ఘటనకు బాధ్యులపై చర్య తీసుకోవాలి

May 18 2026 10:07 AM | Updated on May 18 2026 10:07 AM

కోటపల్లి: మండలంలోని సిర్సాలో సిడం లచ్చన్న, సిడం రాకేశ్‌కు చెందిన ఇద్దరు ఆదివాసీల ఇళ్లు కాలిపోవడానికి కారకులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి ఎర్మ పున్నం డిమాండ్‌ చేశారు. ఆదివారం బాధిత కుటుంబాన్ని పరామర్శించి వివరాలు అడి గి తెలుసుకున్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన లచ్చన్న, రాకేశ్‌లు కన్న రాజేశ్‌ ఇంట్లో అద్దెకు ఉంటూ జీవనం సాగిస్తున్నారన్నారు. మే 5న బీరం భాస్కర్‌ రెడ్డి తన పెరట్లో వ్యర్థాలను కాల్చివేసి నిప్పులు ఆర్పకపోవడంతో అర్థరాత్రి నిప్పురవ్వలు ఎగిసిపడి ఇంటికి అంటుకోవడంతో ఇంట్లోని సామగ్రితో పాటు రూ.2లక్షల 77వేల నగదుతో పాటు 10 తులాల వెండి పూర్తిగా కాలిబూడిదైందన్నారు. ఇంత జరిగినా బీరం భాస్కర్‌రెడ్డి తనకేం తెలియదన్నట్లు వ్యవహరిస్తూ అందరిని తప్పుదోవ పట్టిస్తున్నాడడన్నారు. ఘటన జరిగి పదిరోజులు కావస్తున్నా మంత్రి వివేక్‌ వెంకటస్వామి పట్టించుకోకపోవడం దారుణమన్నారు. పోలీసు అధికారులు కూడా నామామాత్రంగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికై నా ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు తలండి ముత్తయ్య, నాయకులు ఆత్రం సంపత్‌, కొర్తె సమ్మయ్య, మైసయ్య, సోయం దుర్గయ్య, రాజబాపు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement