విద్యతోపాటు పదేళ్లు కష్టపడి 2017లో బ్లాక్‌బెల్ట్ సాధించా. నా విద్యార్థి దశలో జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని బంగారు పతకాలు సాధించాను. రష్యాలో జరిగిన ఇంటర్నేషనల్ కిక్‌బాక్సింగ్ పోటీల్లో పాల్గొన్న. నస్పూర్‌లో ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులకు కరాటేలో శిక్షణ ఇస్తున్న.
– బియ్యాల మౌనిక్,
బ్లాక్‌బెల్ట్ 1వ డాన్, నస్పూర్
ఐదేళ్లుగా విద్యార్థులకు శిక్షణ
తల్లిదండ్రుల ప్రోత్సాహంతో 2001లో బ్లాక్‌బెల్ట్ పొందాను. బ్లాక్‌బెల్ట్ అనేది కరాటే క్రీడాకారులకు అరుదైన గుర్తింపు. ఎన్నో ఏళ్లు శ్రమిస్తే తప్ప బ్లాక్‌బెల్ట్ పొందలేరు. జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్న. గత ఐదేళ్ల నుంచి రామకృష్ణాపూర్ పరిధిలో విద్యార్థులకు కరాటే, యోగాలో శిక్షణ ఇస్తున్న.
– గీతాదేవి, బ్లాక్‌బెల్ట్, రామకృష్ణాపూర్


