ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి

May 16 2026 1:27 AM | Updated on May 16 2026 1:27 AM

నస్పూర్‌: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్‌ పీ.చంద్రయ్య అన్నారు. శుక్రవారం మంచిర్యాల నగరంలోని 32వ డివిజన్‌లో ఇందిరమ్మ ఇళ్ల పనుల పురోగతిని మేయర్‌ ధర్ని మధుకర్‌, కమిషనర్‌ అన్వేష్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణం తర్వగా పూర్తి చేసుకోవాలని అన్నారు. డివిజన్‌లోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ అధికారి, మున్సిపల్‌ సిబ్బంది, నాయకులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement