మంచిర్యాలఅగ్రికల్చర్: విద్యార్థులు కష్టపడి చదివితే ఎంచుకున్న లక్ష్యాలను సాధించవచ్చని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో విద్యా వారోత్సవాల్లో భాగంగా ఏర్పా టు చేసిన కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. ప్ర భుత్వ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో ఉన్నత విద్యను అభ్యసించాలని, ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకొని సాధించే దిశగా కృషి చేయాలన్నారు. అనంతరం జిల్లాలో ప్రథ మ, ద్వితీయ, స్థానాలలో నిలిచిన పదోతరగతి, ఇంటర్, క్రీడా విభాగాల విద్యార్థులను సత్కరించారు. ఒక్కొక్కరికి ప్రభుత్వం ప్రకటించిన రూ.10 వేల నగదు, ప్రశంసాపత్రం, జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఈవో ఎస్.యాదయ్య, జిల్లా సమన్వయకర్తలు ముత్యబోయిన భరత్ కుమార్, జంబోజు సత్తయ్య, కే.విజయలక్ష్మి, కుమ్మరి కృష్ణమూర్తి, రాజ్‌కుమార్, ఎంఈవోలు, హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ధాన్యం తరలింపును సమీక్షించాలి
మంచిర్యాలరూరల్(హాజీపూర్): రైతులు నిబంధనల మేరకు కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చే ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతం చేస్తూ ధాన్యం తరలింపును కూడా ఎప్పటికప్పుడు సమీక్షించాలని కలెక్టర్ కుమార్‌దీపక్ అన్నారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గుడిపేట, నంనూర్‌లలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆదివారం సందర్శించారు. ధాన్యం నిల్వలు, తేమశాతం పరిశీలించారు. కలెక్టర్ వెంట గిర్దావర్ ప్రభు, నిర్వాహకులు, రైతులు ఉన్నారు.


