‘బండి సంజయ్‌ కుమారుడిని అరెస్టు చేయాలి’ | - | Sakshi
Sakshi News home page

‘బండి సంజయ్‌ కుమారుడిని అరెస్టు చేయాలి’

May 12 2026 12:08 AM | Updated on May 12 2026 12:08 AM

మంచిర్యాలటౌన్‌: కేంద్రమంత్రి బండి సంజయ్‌ కుమారుడు సాయి భగీరథ్‌ను వెంటనే అరెస్టు చేయాలని బీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర నాయకుడు నడిపెల్లి విజిత్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు నివాసంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మైనర్‌ బాలికపై లైంగిక దాడి, అధికారం ఉందని ఆమైపెనే కేసుకు సంబంధం లేని నిర్మల్‌, కరీంనగర్‌లో కేసులు పెట్టడం దుర్మార్గమని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి కాపాడుతున్నారని, ఇటీవల సభలో ప్రధాని నరేంద్రమోదీ సీఎంను పార్టీలోకి ఆహ్వానించడమే నిదర్శనమని అన్నారు. కుమారుడిని కాపాడే ప్రయత్నం చేస్తున్న బండి సంజయ్‌ను మంత్రి పదవి, బీజేపీ నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీ, టీబీజీకేఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement