త్వరలోనే కాంగ్రెస్‌ కమిటీల ఏర్పాటు | - | Sakshi
Sakshi News home page

త్వరలోనే కాంగ్రెస్‌ కమిటీల ఏర్పాటు

May 12 2026 12:08 AM | Updated on May 12 2026 12:08 AM

రామకష్ణాపూర్‌: కాంగ్రెస్‌ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు త్వరలో అన్ని విభాగాలకు పూర్తిస్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు వొడ్నాల శ్రీనివాస్‌ తెలిపారు. స్థానిక పార్టీ కార్యాలయంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. గత ఎన్నో ఏళ్లుగా ఆర్‌కేపీ పట్టణంలో పార్టీ పూర్తిస్థాయి కమిటీల ఏర్పాటు జరుగలేదని తెలిపారు. ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ పూర్తయిందని, రెండు మూడు రోజుల్లో అన్ని విభాగాలకు కమిటీలను ప్రకటిస్తామని తెలిపారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఎన్నిక సందర్భంగా తమపై అక్రమ కేసులు నమోదు చేశారంటూ బాల్క సుమన్‌ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ మంత్రి కాన్వాయ్‌పై దాడి ఘటనలో బీఆర్‌ఎస్‌ నాయకులే కారణమని, హింసను ప్రోత్సహించినందునే పోలీసులు కేసులు నమోదు చేశారని అన్నారు. రైతుల నుంచి చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేయడంతోపాటు ముంపు బాధిత రైతులకు రూ.33 కోట్లు నష్టపరిహారం అందించిన ఘనత మంత్రి వివేక్‌ వెంకటస్వామిదేనని తెలిపారు. సమావేశంలో పార్టీ సీనియర్‌ నాయకులు నీలం శ్రీనివాస్‌గౌడ్‌, మల్లేష్‌, ప్రకాష్‌, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement