మంచిర్యాలటౌన్: జనగణన 2027లో భాగంగా ఇళ్ల గణన కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య అన్నారు. జిల్లావ్యాప్తంగా సోమవారం జనగణన ప్రారంభించగా, మంచిర్యాల నగరంలో జిల్లా అదనపు కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇళ్ల గణన ప్రక్రియను అధికారులు నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని తెలిపారు. ఎన్యుమరేటర్లకు కేటాయించిన ఇళ్ల జాబితా బ్లాక్‌లలో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా వివరాలు నమోదు చేయాలని తెలిపారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా జాగ్రత్త వహించాలని, ప్రతీ కుటుంబానికి సంబంధించిన పూర్తి వివరాలు నమోదు చేయాలని అన్నారు. భవిష్యత్ ప్రణాళికలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ అన్వేష్, డీటీసీపీవో సంపత్, జనగణన అధికారులు హరిప్రసాద్, కృష్ణ, ఎన్యుమరేటర్లు పాల్గొన్నారు.


