మంచిర్యాలక్రైం: రాష్ట్ర ప్రజలు ప్రశాంత వాతావరణంలో బక్రీద్ జరుపుకునేలా అన్ని జిల్లాల పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని డీజీపీ సీవీ ఆనంద్ అన్నారు. బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 28న నిర్వహించే బక్రీద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మతాలకతీతంగా పరస్పర సహకారంతో పండుగ జరుపుకునేలా పోలీస్ శాఖ సమన్వంతో పని చేయాలని ఆదేశించారు. ప్రార్థన స్థలాలు, ఈద్గాలు, మసీద్‌లు, ప్రధాన రహదారులు, మార్కెట్ ప్రాంతాలు, జన సంచారం అధికంగా ఉండే ప్రదేశాల్లో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈద్గాలా వద్ద పార్కింగ్ సమస్య లేకుండా పర్యవేక్షించాలన్నారు. సామాజిక మాధ్యమాల్లో ఎలాంటి అసత్య ప్రచారాలు, రెచ్చగొట్టే పోస్టులు లేదా వదంతులు వ్యాప్తి చెందకుండా సైబర్ మానిటరింగ్‌ను మరింత బలోపేతం చేయాలన్నారు. మత పెద్దలతో ముందస్తుగా శాంతి కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. వీసీలో రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా, డీసీపీలు ఎగ్గడి భాస్కర్, రాంరెడ్డి, అడిషనల్ డీసీపీ శ్రీనివాస్, ఏసీపీలు ప్రకాష్, రమేశ్, నాగేందర్‌గౌడ్, సీఐలు పాల్గొన్నారు.


