పాఠశాలల అభివృద్ధిలో ప్రజాప్రతినిధులు కీలకం | - | Sakshi
Sakshi News home page

పాఠశాలల అభివృద్ధిలో ప్రజాప్రతినిధులు కీలకం

May 14 2026 6:27 AM | Updated on May 14 2026 6:27 AM

మంచిర్యాలఅర్బన్‌: పాఠశాలల అభివృద్ధిలో స్థానిక ప్రజాప్రతినిధుల పాత్ర కీలకమని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ చంద్రయ్య అన్నారు. విద్యాశాఖ వారోత్సవాల్లో భాగంగా బుధవారం ఓ ప్రైవేట్‌ ఫంక్షన్‌హాల్‌లో నియోజకవర్గంలోని కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచులకు వర్క్‌షాప్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులుంటారని, వారికి నాణ్యమైన విద్య అందేలా చూడడం ప్రతీఒక్కరి బాధ్యత అన్నారు. డీఈవో యాదయ్య మాట్లాడుతూ పాఠశాలల అభివృద్ధికి స్థానిక ప్రజాప్రతినిధులు తమవంతు సహకారం అందించాలన్నారు. కార్యక్రమంలో మేయర్‌ ధర్ని మధు, డిప్యూటీ మేయర్‌ రమ్య, జిల్లా విద్యాశాఖ కోఆర్డినేటర్లు విజయలక్ష్మి, సత్తయ్య, రాజ్‌కుమార్‌, ఎంఈవోలు మాలవీదేవి, పద్మజా, తిరుపతిరెడ్డి, శైలజ, రాజు, విజయ్‌కుమార్‌, రిసోర్స్‌ పర్సన్లు జనార్దన్‌, సత్యనారాయణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement