తాటిచెట్టు ఎక్కుదామా?.. | - | Sakshi
Sakshi News home page

తాటిచెట్టు ఎక్కుదామా?..

May 15 2026 12:37 PM | Updated on May 15 2026 12:37 PM

చెన్నూర్‌రూరల్‌: వేసవిలో ఎండ తీవ్రతకు చిన్నారులు ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా నీడ పట్టున ఉండి వివిధ ఆటలు ఆడుకుంటున్నారు. సెల్‌ఫోన్లకు దూరంగా ఉంటున్నారు. మండలంలోని బావురావుపేటలో చిన్నారులు ఇంటి ఆవరణలో ఒకేచోట గుమిగూడి ఒకరి చేతిపై మరొకరు ఇలా చేతులు పెట్టి‘తాటిచెట్టు ఎక్కుదామా’ అంటూ ఆటలు ఆడుతూ కనిపించారు.

కంప్యూటర్‌ విద్య

పెంచికల్‌పేట్‌: వేసవి సెలవులను విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటున్నారు. మండల కేంద్రంలోని కిరణ్‌ మాడ్రన్‌ స్కూల్‌లో వేసవిలో విద్యార్థులకు ఉచితంగా కంప్యూటర్‌లో శిక్షణ ఇస్తున్నారు. ప్రతీరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యార్థులు కంప్యూటర్‌లో ఎంఎస్‌ వర్డ్‌, పెయింట్‌, ఎక్సెల్‌ నేర్చుకుంటున్నారు. ప్రతీరోజు సుమారు 20 మంది విద్యార్థులు శిక్షణ తరగతులకు హాజరవుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement