కాగజ్‌నగర్‌టౌన్: మండలంలోని ఆరెగూడ గ్రామానికి చెందిన చాపిలే సుజాత (32) ఈ నెల 12న అదే గ్రామంలో కూలీ పనికి వెళ్ళింది. పని చేస్తుండగా మధ్యాహ్నం ఒక్కసారిగా అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు స్థానికంగా ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం పట్టణంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు మృతురాలి భర్త రమేశ్ తెలిపారు. విషయాన్ని ఆర్‌ఐకి సమాచారం అందించినట్లు పేర్కొన్నారు. ఈ విషయమై తహసీల్దార్ మధూకర్‌ను సంప్రదించగా తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదన్నారు. వడదెబ్బతో మృతి చెందినట్లు నిర్ధారణ చేసుకుని ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కారు ఢీకొని ఒకరు..
నర్సాపూర్(జి): కారు ఢీకొని ఒకరు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై గణేశ్ తెలిపిన వివరాల మేరకు తానూర్ మండలం బేల్ తరోడాకు చెందిన దాసరి నడిపి పోశెట్టి (64) డొంగుర్గాంలోని తన కూతురు వద్దకు వెళ్లడానికి బుధవారం రాత్రి ఆర్టీసీ బస్సులో వచ్చి అర్లి(కె)ఎక్స్ రోడ్డు వద్ద దిగి ఎన్‌హెచ్ 61 రోడ్డు దాటుతున్నాడు. ఈ క్రమంలో నిర్మల్ నుంచి భైంసా వైపు వెళ్తున్న ఎగ్గాం గ్రామానికి చెందిన గంగాధర్ తన కారును అతివేగంగా, అజాగ్రత్తగా నడుపుతూ పోశెట్టిని బలంగా ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు 108లో భైంసా ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లగా మెరుగైన చికిత్స నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందాడు. మృతుని కుమారు డు దాసరి భోజరాం ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
భర్త వేధిస్తున్నాడని మహిళ ఫిర్యాదు
ఆదిలాబాద్‌టౌన్: భర్త తనను అదనపు కట్నం కోసం వేధిస్తూ, వ్యక్తిగత వీడియోలతో బ్లాక్‌మెయి ల్ చేస్తున్నాడంటూ ఓ మహిళ వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు సీఐ సునీల్ కుమార్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. బాధితురాలి భర్త బెడ్‌రూమ్‌లో కలిసి ఉన్న సమయంలో ఆమెకు తెలియకుండా సెల్‌ఫోన్‌లో వీడియోలు చిత్రీకరించాడు. అనంతరం ఆ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానంటూ బెదిరింపులకు పాల్ప డుతున్నాడు. అలాగే ఆమె పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో నకిలీ ఖాతా సృష్టించి, తనతో కలిసి ఉన్న ఫొటోల ను పోస్టు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అదనంగా రూ.2 లక్షల కట్నం తీసుకురావాలని ఒత్తిడి చేస్తూ, విషయం ఎవరికి చెప్పినా తనను, కుటుంబ సభ్యులను చంపేస్తానని బెదిరిస్తున్నాడని బాధితురాలు తెలిపింది. దాదాపు ఎనిమిది రోజుల క్రితం ఆమె ఇంటి వద్దకు వచ్చి నాతో రావాలని, లేకపోతే నీ వీడియోలు వైరల్ చేస్తానని, ముఖంపై యాసిడ్ పోస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నాడు. అలాగే బంగారం తీసుకురావాలని గొడవ చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
యువకుడిపై పోక్సో కేసు
కుంటాల: మండలంలోని అందకూర్‌కు చెందిన యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై సిరివేని అశోక్ తెలిపారు. గ్రామానికి చెందిన శ్రీధర్ అనే యువకుడు ఈ నెల13న రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి నిద్రిస్తున్న బాలిక (15) వద్దకు వెళ్లి లైంగిక దాడికి యత్నించాడు. బాలిక కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు పట్టుకునే ప్రయత్నంతో యువకుడు పరారయ్యాడు. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు.


