మంచిర్యాలఅర్బన్: మంచిర్యాల నగరంలోని ఆలయాల్లో హనుమాన్ జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి భక్తులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయాలన్ని హనుమాన్ నామస్మరణతో మారుమోగాయి. స్థానిక విశ్వనాథ స్వామి దేవస్థానంలోని ఆంజనేయ ఆలయంలో గణపతి పూజా, అభిషేకం, నివేదన, మంగళహారతి తదితర కార్యక్రమాలు నిర్వహించారు. తమలపాకులతో హనుమాన్‌కు అభిషేకం చేశారు. గౌతమినగర్ కోదండ రామాలయం, గర్మిళ్ల భక్తాంజనేయస్వామి దేవాలయం, మారుతినగర్, హమాలీవాడ, తిరుమలగిరి కాలనీల్లో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.


