బెల్లంపల్లి: పట్టణంలోని కన్నాల శివారులో నేషనల్ హైవేను ఆనుకుని నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఎట్టకేలకు పంపిణీకి నోచుకున్నాయి. బుధవారం పట్టణంలోని పద్మశాలి భవన్‌లో సబ్ కలెక్టర్ మనోజ్, మున్సిపల్ చైర్‌పర్సన్ దావ స్వాతి, కమిషనర్ తన్నీరు రమేశ్, తహసీల్దార్ ఎల్.కృష్ణ , ఏసీపీ వి.కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో లక్కీడ్రా ద్వారా 108 ఇళ్లు లబ్ధిదారులకు అప్పగించారు. బీసీ, ఇతర కేటగిరీలకు 71, ఎస్సీలకు 18, ఎస్టీలకు 6, మైనార్టీలకు 13 ఇళ్లు కేటాయించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్, చైర్‌పర్సన్ మాట్లాడుతూ డబుల్ బెడ్‌రూం ఇళ్లకోసం 763 దరఖాస్తులు రాగా 496 మందిని అర్హులుగా గుర్తించామన్నారు. కాగా ప్రక్రియ ప్రారంభానికి ముందు బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు, నాయకులు అభ్యంతరం తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ హమీద్ , కౌన్సిలర్లు ఆసాది మధు, హారిక, పద్మ, వంశీకృష్ణ, నిజాముద్దీన్, శ్రావన్, పున్నం చంద్రు, రాజం, రాయమల్లు, కుమారస్వామి, లబ్ధిదారులు పాల్గొన్నారు.


