20న మెడికల్‌ షాపుల బంద్‌ | - | Sakshi
Sakshi News home page

20న మెడికల్‌ షాపుల బంద్‌

May 17 2026 7:08 AM | Updated on May 17 2026 7:08 AM

మంచిర్యాలటౌన్‌: ఈ నెల 20న దేశవ్యాప్తంగా మెడికల్‌ షాపుల బంద్‌ నిర్వహించనున్నట్లు జిల్లా కెమిస్ట్‌, డ్రగ్గిస్ట్‌ అసోసియేషన్‌ సభ్యులు తెలిపారు. జిల్లా కేంద్రంలో శనివారం బంద్‌ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అసోసియేషన్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మోటూరి చంద్రశేఖర్‌రావు, తొగరు సుధాకర్‌ మాట్లాడుతూ ఆన్‌లైన్‌లో మందుల విక్రయాలు ఆపాలని, కార్పొరేట్‌ సంస్థలకు భారీ డిస్కౌంట్లు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆన్‌లైన్‌ ఫార్మసీ వల్ల మందుల అమ్మకాలపై నియంత్రణ ఉండదని, నకిలీ, మత్తు కలిగించే మందులు ప్రిస్కిప్షన్‌ లేకుండా విచ్చలవిడిగా దొరికే అవకాశం ఉంటుందని తెలిపారు. వీటికి వ్యతిరేకంగా ఆల్‌ ఇండియా కెమిస్ట్‌, డ్రగ్గిస్ట్‌ అసోసియేషన్‌ మద్దతుగా, తెలంగాణ కెమిస్ట్‌, డ్రగ్గిస్ట్‌ అసోసియేషన్‌ పిలుపు మేరకు జిల్లాలోనూ మెడికల్‌ షాపులను ఒకరోజు బంద్‌ చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్‌ జిల్లా కోశాధికారి జి.రాజేంద్రప్రసాద్‌, ఎం.బాలేశ్వర్‌రావు, గోవింద్‌రెడ్డి, జి. రాజు, కె.చంద్రశేఖర్‌, శ్రీనివాస్‌, ఎం.కిరణ్‌కుమార్‌, విష్ణు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement