ఆటో బోల్తా.. ఒకరు మృతి | - | Sakshi
Sakshi News home page

ఆటో బోల్తా.. ఒకరు మృతి

May 14 2026 6:27 AM | Updated on May 14 2026 6:27 AM

భైంసారూరల్‌: మండలంలోని మాటేగాం సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఎస్సై సుప్రియ తెలిపిన వివరాల ప్రకారం.. భైంసా పట్టణంలోని ఓవైసీనగర్‌కు చెందిన ఎనిమిది మంది ఆటోలో నిర్మల్‌లో జరిగిన ఫంక్షన్‌కు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వేగంగా వస్తున్న ఆటో మాటేగాం సమీపంలో అదుపుతప్పి బోల్తాపడింది. ప్రమాదంలో షేక్‌ పాషా (78) సంఘటన స్థలంలోనే మృతి చెందగా, డ్రైవర్‌ మారుతి, సల్మాన్‌, అస్మాబేగం, సుమేరా బేగం, రేష్మాబేగం, రబియా మాహేక్‌, రెహనా బేగంలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు 108లో భైంసా ఏరియా ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృత దేహాన్ని భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను ఎస్సై సుప్రియ వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement