తానూరు: మండలంలోని జౌలా(కే) గ్రామానికి చెందిన సావంత్ దేవానంద్ (35) అనే యువకుడు మద్యానికి బానిసై తన వ్యవసాయ చేనులో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై షేక్ జుబేర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు.. సావంత్ దేవానంద్ గత కొన్నేళ్లుగా మద్యానికి బానిసై పనులు చేయకుండా తిరుగుతున్నాడు. ఈనెల 8న తల్లిదండ్రులు, భార్య ఏదైనా పని చేయాలనడంతో వారితో గొడవ పడ్డాడు. అనంతరం భార్య మీరా, ఇద్దరు పిల్లలతో పుట్టింటికి వెళ్లింది. తల్లిదండ్రులు గంగాబాయి –రావుసాబ్‌లు బంధువుల గ్రామం ముధోల్‌కు వెళ్లారు. మనస్తాపం చెందిన దేవానంద్ ఆదివారం చేనుకు వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రైతులు పోలీసులకు సమాచారం అందించగా ఎస్సై షేక్ జుబేర్ ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి భార్య మీరా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


