నేటి నుంచి ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు

May 13 2026 2:14 AM | Updated on May 13 2026 2:14 AM

మంచిర్యాలఅర్బన్‌: జిల్లాలో ఇంటర్మీడియెట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లాలోని 14 పరీక్షల కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మొదటి, రెండో సంవత్సరం పరీక్షలు 13నుంచి 20వ వరకు నిర్వహించనున్నారు. 5316 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. మొదటి సంవత్సరం 3649 మంది, ద్వితీయ సంవత్సరం 1667 మంది పరీక్ష రాయనున్నారు. మంచిర్యాల ప్రభుత్వ జూనియర్‌ కళాశాల పరీక్ష కేంద్రాన్ని డీఐఈవో అంజయ్య మంగళవారం సందర్శించారు. విద్యార్థులు సమయానికి కేంద్రాలకు చేరుకోవాలని తెలిపారు. పరీక్షల కోసం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement