సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి

May 11 2026 11:56 PM | Updated on May 11 2026 11:56 PM

ఉట్నూర్‌రూరల్‌: గ్రీవెన్స్‌లో ప్రజల నుంచి వ చ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకో వాలని ఐటీడీఏ పీవో మంద మకరందు అధి కారులను ఆదేశించారు. సోమవారం ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి వి విధ మండలాల నుండి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. నార్నూర్‌ మండలం జాండాకు చెందిన మడావి హను ఆర్థికసాయం అందించాలని, ఇంద్రవెల్లి మండలం వాల్గొండకు చెందిన కనక చందు బోర్‌వెల్‌ మంజూరు చేయాలని, ఇచ్చోడ మండలం నర్సాపూర్‌కు చెందిన శ్రీదేవి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చే యాలని, తిర్యాణి మండలం మార్కగూడకు చెందిన గోదావరి ఉపాధి కల్పించాలని అర్జీలు అందజేశారు. పీవో మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement