మారుమూల పల్లెలకు ఆర్టీసీ సేవలు | - | Sakshi
Sakshi News home page

మారుమూల పల్లెలకు ఆర్టీసీ సేవలు

May 13 2026 2:02 AM | Updated on May 13 2026 2:02 AM

నేటి నుంచి ప్రారంభం ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ

నేరడిగొండ: బోథ్‌ ఎమ్మెల్యే అనిల్‌ జాదవ్‌ చొరవతో నియోజకవర్గంలోని పలు మారుమూల గ్రామాల కు నేటి నుంచి ఆర్టీసీ సేవలు అందుబాటులోకి రా నున్నాయి. ఏళ్లుగా రవాణా సౌకర్యాల లేమితో ఇ బ్బందులు పడుతున్న ప్రజలు సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో ఆయన స్పందించారు. ఉ న్నతాధికారులు, రవాణా శాఖ మంత్రి పొన్నంతో మాట్లాడి ఆయా గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పి ంచేందుకు కృషి చేశారు. ఇచ్చోడ, సిరికొండ, తాంసి, సొనాల మండలాల్లోని మారుమూల ప్రాంతా లకు నేటి నుంచి ఆర్టీసీ బస్సులు నడవనున్నట్లుగా ఎమ్మెల్యే తెలిపారు.

ప్రారంభం కానున్న బస్సు రూట్లు..

నేరడిగొండ–కుంటాల, నేరడిగొండ–బోథ్‌ (వయా వడూర్‌, దర్బాతాండ, ధన్నూర్‌, కుచులపూర్‌), సొనాల–వజ్జర్‌, ఆదిలాబాద్‌–బజార్‌హత్నూర్‌ (వ యా గుడిహత్నూర్‌, ముత్నూర్‌, దామాన్‌ గూడ, టెంబి, దేగామ, జాతర్ల), ఇచ్చోడ–సిరికొండ, ఇచ్చోడ–సిరిచెల్మ, ఇచ్చోడ–కోకస్‌మన్నూర్‌, ఇచ్చోడ–గుడిహత్నూర్‌ (వయా బజార్‌హత్నూర్‌, దేగా మ, ముత్నూర్‌), ఆదిలాబాద్‌–గిరిగావ్‌ (వయా సుంకిడి, కుచులపూర్‌), ఆదిలాబాద్‌–జామిడి (వయా బండల నాగపూర్‌, కప్పర్ల), ఆదిలాబాద్‌–గొల్లఘాట్‌, తాంసి గ్రామాలకు ఆర్టీసీ సేవలు ప్రారంభం కానున్నాయి. ప్రజలు ఈ సేవలను వినియోగించుకోవాలని ఎమ్మెల్యే కోరారు.

నిర్వాసితులకు నష్టపరిహారం

నేరడిగొండ: మండలంలోని రాజురా గ్రామ ని ర్వాసితులకు నష్టపరిహారం కింద మంజూరైన రూ.19,78,116లను బోథ్‌ ఎమ్మెల్యే అనిల్‌ జాదవ్‌ మంగళవారం అందజేశారు. తొమ్మిది మంది బాధితులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నిర్వాసితులకు న్యాయం చేయడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. ఇందులోమాజీ ఎంపీపీ సజన్‌,ప్రతాప్‌ తదితరులున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement