చెన్నూర్‌లో 2000లో బ్లాక్‌బెల్ట్ పొందాను. 2007లో బ్లాక్‌బెల్ట్ 2వ డాన్ సాధించాను. బ్లాక్‌బెల్ట్ సాధించే క్రమంలో వివిధ రాష్ట్రాల్లో జరిగిన రాష్ట్ర, జాతీయ స్థాయి కరాటే పోటీల్లో పతకాలు సాధించాను. గోవా, చెన్నయ్‌లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో బంగారు పతకాలు గెలుచుకున్న. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో పాల్గొన్న. జిల్లాలోని పలు ప్రాంతాల్లో విద్యార్థులకు కరాటేలో శిక్షణ ఇస్తున్న.
– భారతి, బ్లాక్‌బెల్ట్ 2వ డాన్, మంచిర్యాల
నా కల నెరవేరింది..
నా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో బ్లాక్‌బెల్ట్ సాధించాను. కరాటే మాస్టర్ కావాలనే నా కల నెరవేరింది. 2018లో బ్లాక్‌బెల్ట్ సాధించి బెల్లంపల్లి ప్రాంతంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులకు కరాటే శిక్షణ ఇస్తున్నాను. గతంతో పోలిస్తే ప్రస్తుతం కరాటే శిక్షణపై బాలికలు మక్కువ చూపుతున్నారు.
– వేల్పుల శిరీష, బ్లాక్‌బెల్ట్ బెల్లంపల్లి


