నస్పూర్: వివిధ పనుల నిమిత్తం ఇతర రాష్ట్రాల నుంచి ఈ ప్రాంతాలకు వచ్చే వారిపై ప్రత్యేక నిఘా ఉంటుందని మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్ తెలిపారు. సీసీసీ నస్పూర్ పోలీసుల ఆధ్వర్యంలో బుధవారం రాత్రి సంఘం మల్లయ్యపల్లెలో కమ్యునిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. డీసీపీ మాట్లాడుతూ స్థానికంగా ఇళ్లు అద్దెకు ఇచ్చే యజమానులు పూర్తి వివరాలు తీసుకోవాలని తెలిపారు. ఆధార్ కార్డు, శాశ్వత చిరునామా, గతంలో ఎక్కడ పని చేశారు, కుటుంబ వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఏసీపీ ప్రకాశ్, రూరల్ సీఐ గోపతి రవీందర్, ఎస్సైలు మేకల ప్రశాంత్, శ్రావణ్‌కుమార్ పాల్గొన్నారు.
పశువుల అక్రమ రవాణాపై నిఘా
దండేపల్లి: బక్రీద్ పండుగ నేపథ్యంలో పశువుల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు డీసీపీ భాస్కర్ తెలిపారు. మంచిర్యాల–జగిత్యాల జిల్లాల సరిహద్దు దండేపల్లి మండలం గూడెం వద్ద అటవీ చెక్‌పోస్టును గురువారం ఆయన తనిఖీ చేశారు. ని బంధనలకు విరుద్ధంగా, అక్రమంగా పశువులు తరలించకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. లక్సెట్టిపేట సీఐ రమణమూర్తి, దండేపల్లి, లక్సెట్టిపేట ఎస్సైలు తహాసీనొద్దీన్, సురేష్ పాల్గొన్నారు.
త్వరగా అన్‌లోడ్ చేయాలి
లక్సెట్టిపేట: రైస్‌మిల్లర్లు ధాన్యం దిగుమతి వేగవంతం చేయాలని డీసీపీ భాస్కర్ అన్నారు. గురువారం మండలంలోని ధాన్యం కొనుగోలు రైస్‌మిల్లులను పరిశీలించి మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యం బస్తాలను త్వరగా అన్‌లోడ్ చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ దిలీప్‌కుమార్, సీఐ రమణామూర్తి, ఎస్సై గోపతి సురేష్, మిల్లు యజమానులు పాల్గొన్నారు.


