కోటపల్లి: ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ నాయకులు, రైతులు మంగళవారం మండలంలోని దేవులవాడ గ్రామంలో 63వ జాతీయ రహదారి ధర్నా నిర్వహించారు. మండలంలోని రాపన్‌పల్లి, లక్ష్మిపూర్ కొనుగోలు కేంద్రాలను మాజీ జెడ్పీ వైస్‌చైర్మన్ మూల రాజిరెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు సందర్శించారు. రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ధర్నా చేపట్టారు. తహసీల్దార్ రాఘవేందర్‌రావు అక్కడికి చేరుకోగా బీఆర్‌ఎస్ నాయకుడు ఆయన కాళ్లు మొక్కి ధాన్యం కొనాలని వేడుకున్నాడు. రాజిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి వివేక్‌వెంకటస్వామి ధాన్యం కొనుగోళ్లను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఏరినాగుల ఓదెలు, రెవెల్లి మహేశ్, తుమ్మ రమేశ్, దోమకొండ అనిల్, భారతీ, కొప్పుల ప్రభాకర్, మానిశెట్టి మల్లయ్య, సాయి పాల్గొన్నారు.


