ఎయిడ్స్‌ రహిత జిల్లాగా మారుద్దాం.. | - | Sakshi
Sakshi News home page

ఎయిడ్స్‌ రహిత జిల్లాగా మారుద్దాం..

May 18 2026 10:07 AM | Updated on May 18 2026 10:07 AM

మంచిర్యాలటౌన్‌: జిల్లాను ఎయిడ్స్‌ రహితంగా మార్చేందుకు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ అనిత అన్నా రు. ‘అంతర్జాతీయ ఎయిడ్స్‌ క్యాండిల్‌లైట్‌ మెమోరియల్‌ డే’ను పురస్కరించుకుని ఆదివా రం సాయంత్రం మంచిర్యాల ప్రభుత్వ జనర ల్‌ ఆస్పత్రి నుంచి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎయిడ్స్‌, లిప్రసీ జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్‌, డిప్యూటి డీఎంహెచ్‌వో సుధాకర్‌ నాయక్‌ మాట్లాడుతూ ఎయిడ్స్‌ వల్ల ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పి ంచడం, సమాజంలో వివక్షను రూపుమాపేందుకు ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డెమో వెంకటేశ్వర్లు, సీహెచ్‌వో నాందేవ్‌, హెల్త్‌ ఎడ్యుకేటర్‌ అల్లాడి శ్రీనివాస్‌, హెల్త్‌ ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌ శ్రీనివాస్‌, డీపీఎంవో రాఘవయ్య, డీపీవో ప్రశాంతి, దిశ మేనేజర్‌ నీలిమ, డీఎండీవో రాఘవయ్య, ఐసీటీసీ కౌన్సి లర్లు శ్రీనివాస్‌, నర్మద, జగన్‌మోహన్‌, ఆంజనేయులు, నరేందర్‌, స్నేహ ఎన్జీవో సభ్యులు, లింక్‌ వర్కర్లు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement