బాధితులకు న్యాయం అందించాలి | - | Sakshi
Sakshi News home page

బాధితులకు న్యాయం అందించాలి

May 13 2026 2:02 AM | Updated on May 13 2026 2:02 AM

● మంచిర్యాల డీసీపీ భాస్కర్‌ ● అంతర్‌ జిల్లా చెక్‌పోస్టు తనిఖీ

నస్పూర్‌: బాధితుల ఫిర్యాదులపై తక్షణమే స్పందించి సత్వర న్యాయం అందేలా చూడాలని డీసీపీ ఏ.భాస్కర్‌ అన్నారు. మంగళవారం ఆయన సీసీసీ నస్పూర్‌ పోలీస్‌స్టేషన్‌ను సందర్శించారు. స్టేషన్‌ను పరిశీలించి రిసిప్షన్‌, సీసీటీఎస్‌ సిబ్బంది, ఇతర పోలీస్‌ సిబ్బంది పనితీరును అడిగి తెలుకున్నారు. రౌడీషీటర్లు, అనుమానితుల వివరాలు, పెండింగ్‌లో ఉన్న కేసుల రికార్డులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల రూరల్‌ సీఐ గోపతి రవీందర్‌, ఎస్సై మేకల ప్రశాంత్‌ పాల్గొన్నారు.

అక్రమ రవాణాకు అవకాశం ఇవ్వొద్దు

తాండూర్‌: పశువుల అక్రమ రవాణాకు ఎలాంటి అవకాశం ఇవ్వొద్దని మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్‌ అన్నారు. సోమవారం అర్ధరాత్రి మండలంలోని రేపల్లెవాడ శివారులో అంతర్‌జిల్లా చెక్‌పోస్టును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వాహనాల తనిఖీలను పర్యవేక్షించారు. విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బందికి సూచనలు ఇచ్చారు. అనంతరం డీసీపీ మాట్లాడుతూ బక్రీద్‌ పండుగ నేపథ్యంలో పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా పశువుల అక్రమ రవాణా చేపడితే కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. తాండూర్‌, బెల్లంపల్లి సీఐలు దేవయ్య, శ్రీనివాస్‌, తాండూర్‌ ఎస్సై ప్రసాద్‌రావు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement