ఆగిపో బాల్యమా..! | - | Sakshi
Sakshi News home page

ఆగిపో బాల్యమా..!

May 13 2026 2:02 AM | Updated on May 13 2026 2:02 AM

● ఎంపీ గోడం నగేశ్‌

నేటి నుంచి ప్రారంభం ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ

బాల్యం ఒక మధురానుభూతి. ఇక వేసవి సెలవులు వస్తే బాలల ఆనందానికి అవధులే ఉండవు. ఆటపాటలతో స్నేహితులతో ఆనందంగా గడుపుతున్నారు. కొందరు చిన్నారులు తమ అభిరుచులకు అనుగుణంగా వేసవి శిబిరాల్లో పెయింటింగ్‌, డ్యాన్స్‌, స్విమ్మింగ్‌ తదితర శిక్షణ పొందుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని వారు చెట్ల నీడలో క్రికెట్‌ వంటి ఆటలు ఆడుతున్నారు. మరికొందరు చెట్ల కొమ్మలకు చీరలు కట్టి ఊయల ఊగుతూ ఎంజాయ్‌ చేస్తున్నారు. నిర్మల్‌ జిల్లా కేంద్రంలో చిన్నారుల సందడిని ‘సాక్షి’ కెమెరా క్లిక్‌ మనిపించింది. – సాక్షి ఫొటోగ్రాఫర్‌, నిర్మల్‌
కళాశాలల అభివృద్ధికి కృషి

పెయింటింగ్‌ వేస్తున్న బాలుడు

చెట్లనీడలో క్రికెట్‌

ఆడుతున్న చిన్నారులు

ఆదిలాబాద్‌టౌన్‌: ప్రభుత్వ కళాశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధికి కృషి చేస్తానని ఎంపీ గోడం నగేశ్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్ట్స్‌ డిగ్రీ కళాశాలలో రూ.4.50లక్షల ఎంపీ నిధులతో ఏర్పాటు చేసిన శుద్ధజల ప్లాంట్‌ను ఎమ్మెల్యే శంకర్‌తో కలిసి మంగళవారం ప్రారంభించారు. గతంలో కళాశాలకు వచ్చిన సమయంలో విద్యార్థులు, ప్రిన్సిపాల్‌ తాగునీటి సమస్య దృష్టికి తీసుకురాగా స్పందించినట్లు తెలిపారు. అనంతరం విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. విద్యా వారోత్సవాల సందర్భంగా కళాశాలలో యోగా, ధ్యానం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ అతీఖ్‌ బేగం, యోగా గురువు తిరుపతి, లెక్చరర్లు, కౌన్సిలర్‌ పోచన్న తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులు ఉన్నతంగా రాణించాలి

తాంసి: ప్రభుత్వ విద్యాసంస్థల్లో కల్పిస్తున్న వసతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నతంగా ఎదగాలని ఎంపీ గోడం నగేశ్‌ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా భీంపూర్‌ కేజీబీవీలో రూ.2.30 కోట్లతో నూతనంగా నిర్మించిన అదనపు గదులను ఎమ్మెల్యే అనిల్‌ జాదవ్‌తో కలిసి మంగళవారం ప్రారంభించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ రాజేశ్వర్‌,ఆదిలాబాద్‌ మార్కెట్‌ చైర్మన్‌ శ్రీకాంత్‌రెడ్డి,ఆత్మ చైర్మన్‌ నారాయణ, సర్పంచ్‌ రంజన, ఎంఈవో రాధాకృష్ణరెడ్డి, ఎస్‌వో రజిని, తహసీల్దార్‌ రమేష్‌, ఎంపీడీవో గోపాలకృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. అనంతరం గోన గ్రామంలో ఏర్పాటు చేసిన కుమురం భీం విగ్రహన్ని, గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని వారు ప్రారంభించారు. సర్పంచ్‌ కమలాబాయి తదితరులు పాల్గొన్నారు.

తాంసి మండలం కప్పర్ల జెడ్పీ పాఠశాలలో ఇటీవల పదో తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ఎంపీ నగేశ్‌, అదనపు కలెక్టర్‌ రాజేశ్వర్‌తో కలిసి సన్మానించారు. అనంతరం పాఠశాలలో అదనపు గదులను ప్రారంభించారు. ఇందులో సర్పంచ్‌ అరుణ్‌, తహసీల్దార్‌ లక్ష్మి, హెచ్‌ఎం ఆనంద్‌, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement