మంచిర్యాలరూరల్(హాజీపూర్): ‘భరత వేదముగా నిరత నాట్యముగా.. కదలిన పదమిది ఈశా..! అనే పాట వచ్చిందంటే చాలు.. శాసీ్త్రయ నృత్యం మదిలో మెదులుతుంది. శాసీ్త్రయ నృత్యమే కాదు ప్రస్తుతం శాసీ్త్రయ, సినీ, జానపదం.. ఇలా పాశ్చాత్య నృత్యాలు కూడా నేర్చుకుంటూ తన్మయత్వం పొందుతున్నారు. సోషల్ మీడియాలో రీల్స్ ప్రపంచం నడుస్తుండటంతో నృత్యాలపై మక్కువ పెరుగుతోంది. ఈ వేసవి సెలవుల్లో నృత్య శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయడంతో కూచిపూడి, భరత నాట్యం నేర్చుకునేందుకు పలువురు ముందుకొస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో ఏర్పాటైన శాసీ్త్రయ నృత్య శిక్షణ శిబిరాలను చిన్నారుల నుంచి పెద్దల వరకు సద్వినియోగం చేసుకుంటూ శిక్షణ పొందుతున్నారు. కళారూపాలు, హస్తముద్రలు, ముఖ, కంటి, పాద విన్యాసాలపై గురువులు శిక్షణ ఇస్తుండగా భక్తి, పురాణ గాధల కళారూపాలకు సంబంధించి నృత్యాలపై సాధన చేస్తున్నారు. నామమాత్రపు ఫీజులతో వేసవిలో శిక్షణ అందిస్తుండగా ప్రస్తుతం జిల్లాలోని మార్కెట్‌రోడ్‌లో శ్రీనందిని నృత్యాలయం, శ్రీసరస్వతి శిశుమందిర్, మున్సిపాలిటీ వద్ద, బెల్లంపల్లి చౌరస్తా, కాలేజ్‌రోడ్‌లలోని నృత్యాలయాలతో పాటు పలు నృత్య శిక్షణ శిబిరాల్లో కూచిపూడి, భరత నాట్యంపై శిక్షణ ఇస్తున్నారు. ఒక్కో కేంద్రంలో 30 నుంచి 100 మంది వరకు నృత్య శిక్షణ పొందుతున్నారు.


