ముందు జాగ్రత్తలు తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ముందు జాగ్రత్తలు తీసుకోవాలి

May 14 2026 6:27 AM | Updated on May 14 2026 6:27 AM

అగ్ని ప్రమాదాలకు సంబంధించి ప్రజలు ప్రాథమికంగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యుట్‌ వల్ల ఎక్కువ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిపై ప్రత్యేక దృష్టి సారించాలి. బీడీ, సిగరెట్‌లను కాల్చిన తర్వాత చేలల్లో, చెత్త ఉన్న చోట పడేయకూడదు. ఇళ్లలో విద్యుత్‌ సరఫరాలో హెచ్చుతగ్గులు నియంత్రించేందుకు స్టెబిలైజర్‌ వినియోగించాలి. గడ్డి వాములు, చెత్త, ప్లాస్టిక్‌ నిల్వలు నివాసాలకు దూరంగా ఉండాలి. అపార్ట్‌మెంట్లు, ఆసుపత్రులు, షాపింగ్‌ మాల్స్‌ సముదాయాల్లో అగ్నిమాపక నిబంధనలు పాటించాలి. – భగవాన్‌రెడ్డి,

జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి, మంచిర్యాల

Advertisement
 
Advertisement
Advertisement