ముగిసిన గోల్‌ షాట్‌ బాల్‌ పోటీలు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన గోల్‌ షాట్‌ బాల్‌ పోటీలు

May 13 2026 2:02 AM | Updated on May 13 2026 2:02 AM

ఆదిలాబాద్‌రూరల్‌: ఆదిలాబాద్‌ రూరల్‌ మండలం చాందా (టి) శివారులోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో మూడురోజులుగా కొనసాగుతున్న గోల్‌ షాట్‌బాల్‌ జాతీయస్థాయి పోటీలు మంగళవారం ముగిశాయి. పోటీల్లో చాంపియన్‌గా బిహార్‌ జట్టు, రన్నరప్‌గా ఆంధ్రప్రదేశ్‌, తృతీయస్థానంలో మహారాష్ట్ర జట్టు నిలిచింది. విజేత జట్లకు బహుమతులు అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా అసోసియేషన్‌ జాతీయ అధ్యక్షుడు సాయిని రవికుమార్‌ మాట్లాడుతూ క్రీడాకారులు నిత్యం సాధన చేస్తూ జాతీయస్థాయిలో రాణించి దేశ ప్రతిష్టను నిలపాలన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజేంద్రప్రసాద్‌, కోశాధికారి రామ్‌ పర్వేశ్‌ కుమార్‌, ఉపాధ్యక్షులు సుధాకర్‌రావు, యోగేష్‌ పాటిల్‌, జాయింట్‌ సెక్రటరీలు కరుణాకరన్‌, దేవిప్రియ, బండ అనిల్‌, ఆదిత్య ఖందేష్కర్‌, డాక్టర్‌ రాహుల్‌ పుష్కర్‌, క్రీడాకారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement